ఏపీలో గత 24 గంటల్లో 6,151 కరోనా పాజిటివ్ కేసులు

17-06-2021 Thu 17:27
  • రాష్ట్రంలో 1,02,712 కరోనా పరీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 1,244 కొత్త కేసులు
  • రాష్ట్రంలో 58 కరోనా మరణాలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మృతి
AP Covid Second Wave update

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,02,712 కరోనా పరీక్షలు నిర్వహించగా 6,151 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,244 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 937 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 199 కేసులు గుర్తించారు. అదే సమయంలో 7,728 మంది కరోనా నుంచి కోలుకోగా, 58 మరణాలు సంభవించాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 12 మంది మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 18,32,902 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,50,904 మందికి కరోనా నయమైంది. ఇంకా 69,831 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 12,167కి చేరింది.