హెచ్సీఏ ఎన్నికల్లో కవిత పోటీ అంటూ వస్తున్న వార్తలపై అజారుద్దీన్ స్పందన

17-06-2021 Thu 17:02
  • కవిత వ్యాఖ్యలు నా దృష్టికి రాలేదు
  • అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు
  • హైదరాబాద్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
Kalvakuntla Kavitha may contest in HCA elections says Azharuddin

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై వేటు వేస్తూ అపెక్స్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. దీనిపై అజార్ స్పందిస్తూ.. తనను తొలగించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.

మరోవైపు, హెచ్సీఏ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హెచ్సీఏ గాడి తప్పిందంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. ఈ అంశంపై అజార్ మాట్లాడుతూ, కవిత వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని చెప్పారు. అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చని, అందులో తప్పేం లేదని అన్నారు. హైదరాబాద్ క్రికెట్ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.