Satya Nadella: మైక్రోసాఫ్ట్​ చైర్మన్​ గా సత్య నాదెళ్ల నియామకం

Satya Nadella Becomes Microsoft CEO
  • ప్రకటించిన సంస్థ
  • థాంప్సన్ స్థానంలో బాధ్యతలు
  • త్రైమాసిక లాభాల్లో 56% వాటా
  • 2014లో సీఈవోగా నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఎంపికై తెలుగు కీర్తిని ఖండాంతరాలకు వ్యాప్తిజేసిన సత్య నాదెళ్ల.. మరో కీలక పదవి చేపట్టబోతున్నారు. అదే సంస్థను నడిపించబోతున్నారు. ఇకపై ఆ సంస్థకు సత్య నాదెళ్ల చైర్మన్ గా ఉండబోతున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

2014లో స్టీవ్ బామర్ స్థానంలో మైక్రోసాఫ్ట్ కు సత్య నాదెళ్ల సీఈవోగా ఎంపికయ్యారు. అదే ఏడాది సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్థానంలో థాంప్సన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు థాంప్సన్ స్థానాన్ని సత్య నాదెళ్లకు సంస్థ అప్పగించింది. థాంప్సన్ స్వతంత్ర డైరెక్టర్ గా కొనసాగుతారని ప్రకటించింది.

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి బిల్ గేట్స్ తప్పుకొన్న ఏడాదికే సంస్థ చైర్మన్ గా సత్య నాదెళ్లకు అవకాశం రావడం విశేషం. మైక్రోసాఫ్ట్ ఇంత వృద్ధి సాధించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. వందల కోట్ల డాలర్ల విలువైన లింక్డ్ ఇన్, నువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్ కొనుగోళ్లకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. కాగా, త్రైమాసిక లాభాల్లో ఒక్కో షేరుపై 56 సెంట్స్   వాటాను ఇస్తామని సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 9 నాటికి చెల్లిస్తామని తెలిపింది.
Satya Nadella
Microsoft
Chairman

More Telugu News