Telangana: తెలంగాణ మంత్రివ‌ర్గ ఉప సంఘం కీల‌క‌ భేటీ

ts ministers sub committee meets
  • తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు అధ్య‌క్ష‌త‌న స‌మావేశం
  • పాల్గొన్న కేటీఆర్‌, ప‌లువురు మంత్రులు
  • భూములు, ఇళ్ల‌ విక్ర‌యాల‌పై కూడా చ‌ర్చ
హ‌రీశ్ రావు అధ్య‌క్ష‌త‌న ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి స‌మావేశ‌మైంది. ఇందులో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అలాగే, తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ కూడా హాజ‌ర‌య్యారు.

గృహ‌నిర్మాణ‌ సంస్థ ప‌రిధిలోని భూములు, ఇళ్ల‌ విక్ర‌యాల‌పై కూడా చ‌ర్చిస్తున్నారు. నిధుల స‌మీక‌ర‌ణ‌పై త‌మ అభిప్రాయాలు తెలుపుతున్నారు. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ ఉప సంఘం ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని అత్యుత్తమ వైద్య సేవలు, వైద్య సేవల మౌలిక సదుపాయాలపై త్వరలో అధ్యయనం చేయనున్న నేప‌థ్యంలో దీనిపై కూడా చ‌ర్చిస్తున్నారు. వైద్య సేవలు, ఆసుప‌త్రుల్లో సౌకర్యాల మెరుగుదల వంటి అంశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Telangana
Harish Rao
KTR

More Telugu News