సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివసించిన ఇంటిని అద్దెకు ఇవ్వాలని యజమానుల నిర్ణయం

  • గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య
  • గతంలో బాంద్రాలో నివసించిన సుశాంత్
  • ఓ ఫ్లాట్ ను మూడేళ్లకు లీజుకు తీసుకున్న వైనం
  • ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇల్లు
  • నెలకు రూ.4 లక్షలు అద్దె నిర్ణయించిన ఓనర్లు
House for rent which Sushant Singh Rajput lived

సుశాంత్ సింగ్ రాజ్ పుత్... ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ హీరో అత్యంత విషాదకర పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో చెలరేగిన ప్రకంపనలు ఇంకా సద్దుమణగలేదు.

 కాగా, సుశాంత్ తన చివరి ఘడియల వరకు ముంబయి బాంద్రాలోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో నివసించాడు. అణువణువు సుశాంత్ జ్ఞాపకాలతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు బోసిపోయినట్టుగా అనిపిస్తోంది. గత ఏడాదిగా ఆ ఇంట్లో ఎవరూ ఉండడంలేదు. ఈ నేపథ్యంలో, ఆ ఫ్లాట్ ను అద్దెకు ఇవ్వాలని యజమానులు నిర్ణయించారు.

అయితే ఇంటి అద్దె మాత్రం అదిరిపోయే రేంజిలో ఉంది. ఈ ఫ్లాట్ కు నెలకు రూ.4 లక్షలు అద్దె ఇవాల్సి ఉంటుందని యజమానులు పేర్కొంటున్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ ఫ్లాట్ లో నివసించిన సమయంలో నెలకు రూ.4.5 లక్షల చొప్పున మూడేళ్లకు లీజుకు తీసుకున్నాడు. మరి, ఇంతటి విశాలవంతమైన, అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన డీలక్స్ ఫ్లాట్ ను ఎవరు అద్దెకు తీసుకుంటారో చూడాలి!

More Telugu News