Annuity: అమరావతి రైతులకు రూ.195 కోట్ల కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

AP Govt releases annuity for Amatavati farmers
  • ల్యాండ్ పూలింగ్ లో భూములు అప్పగించిన రైతులు
  • నాటి ప్రభుత్వంతో ఒప్పందం
  • ఏటా కౌలు చెల్లించేందుకు అంగీకారం
  • తాజాగా కౌలు విడుదల చేస్తూ ఉత్తర్వులు
అమరావతి రైతులకు 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ల్యాండ్ పూలింగ్ పథకం కింద గతంలో ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారికి ఈ వార్షిక కౌలు వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.

కాగా, ఈ ఏడాది కౌలు కోసం మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే ఈ పిటిషన్ పై విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. గతంలో రైతులు కోర్టును ఆశ్రయించగా, విచారణ తర్వాతే సర్కారు నిధులు విడుదల చేసింది. ఈసారి విచారణకు ముందుగానే కౌలు ఇచ్చినట్టయింది.

Annuity
Farmers
Amaravati
Andhra Pradesh

More Telugu News