అఖిలేశ్ యాదవ్‌తో భేటీ అయిన బీఎస్పీ బహిష్కృత ఎమ్మెల్యేలు
- గతేడాది బీఎస్పీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు
- ఎస్పీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానన్న సుష్మా పటేల్
- సస్పెన్షన్‌ను మాయావతి ఎత్తేస్తారన్న మరో ఎమ్మెల్యే
మరో శాసనసభ్యుడు హకీంలాల్ బింద్ మాట్లాడుతూ.. అఖిలేశ్‌ను కలిసిన వారిలో తనతోపాటు చౌధరి అస్లాం అలీ, ముజ్తబా సిద్ధిఖి, హర్‌గోవింద్ భార్గవ్, మహమ్మద్ అస్లాం రైనీ, సుష్మా పటేల్ ఉన్నట్టు చెప్పారు. అయితే, అఖిలేశ్‌ను కలిసిన వారిలో తాను లేనని హర్‌గోవింద్ తెలిపారు.
మాజీ స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్భర్ తమతో వస్తే మొత్తం 12 మంది అవుతామని, దీంతో ప్రత్యేక వర్గంగా కొనసాగుతామని భింగా ఎమ్మెల్యే అస్లాం రైనీ తెలిపారు. మరో ఎమ్మెల్యే ముజ్తబా సిద్ధికీ మాట్లాడుతూ.. తమపై వేసిన సస్పెన్షన్‌ను మాయావతి ఎత్తివేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.