Nagarjuna: యాక్షన్ ఎపిసోడ్స్ కోసం నాగ్ ప్రత్యేక శిక్షణ!

Action scenes are highlight in Praveen Sattaru movie
  • ప్రవీణ్ సత్తారుతో నాగ్ మూవీ
  • సినిమాలో భారీ యాక్షన్ దృశ్యాలు 
  • కథానాయికగా కాజల్ అగర్వాల్ 
  • కథపై నమ్మకంతో వున్న నాగ్  
నాగార్జున ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' వంటి యాక్షన్ సినిమాల తరువాత ఆయన మరో యాక్షన్ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి ఉంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది .. కరోనా కారణంగా ఆగిపోయింది.

కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతూ ఉండటంతో సెట్స్ పైకి వెళ్లడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. తదుపరి షెడ్యూల్లో నాగ్ పై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారట. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కనిపించనున్న నాగార్జునపై హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేశారని అంటున్నారు. అందుకోసం నాగార్జున ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నారట. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
Nagarjuna
Kajal Agarwal
Praveen Sattaru

More Telugu News