సైకో కిల్లర్ గా కనిపించనున్న రాశి ఖన్నా!

15-06-2021 Tue 19:08
  • గ్లామరస్ హీరోయిన్ గా మంచి క్రేజ్
  • కోలీవుడ్ లోను మంచి అవకాశాలు
  • హిందీ వెబ్ సిరీస్ ల పై దృష్టి
  • బిజీ అవుతున్న రాశి ఖన్నా
Rashi Khanna new web series

తెలుగు తెరపై తెల్ల కలువలా విరిసిన కథానాయికగా రాశి ఖన్నా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా రాశి ఖన్నా దూకుడుగా వెళ్లి సినిమాలు చేయలేదు. ఒకదాని తరువాత ఒకటిగా తాపీగా చేస్తూ వెళుతోంది. హిట్ పడితే హడావిడి చేయడం .. ఫ్లాప్ పడితే డీలాపడిపోవడం రాశి ఖన్నాకు తెలియదు. అలాంటి రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో తన స్పీడ్ పెంచింది. తెలుగుతో పాటు తమిళ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. అంతేకాదు హిందీ వెబ్ సిరీస్ లను కూడా లైన్లో పెట్టేస్తోంది. దాంతో ఇప్పుడు రాశి ఖన్నా ఫుల్ బిజీ అయింది.

ఆల్రెడీ హిందీలో ఆమె షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రను చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరో భారీ వెబ్ సిరీస్ లోను ఆమె డిఫరెంట్ రోల్ చేస్తోంది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిరీస్ కి రాజేశ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అజయ్ దేవగణ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సిరీస్ లో, రాశి ఖన్నా సైకో కిల్లర్ పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ వెబ్ సిరీస్, డిస్నీ హాట్ స్టార్ లో జులై 21 నుంచి స్ట్రీమింగ్ కానుందని చెబుతున్నారు.