Hyper Aadi: నేను కేవలం ఆర్టిస్టునే... తప్పు చేసి ఉంటే క్షమాపణ చెబుతా: హైపర్ ఆది

  • ఓ కార్యక్రమంలో తెలంగాణను కించపరిచాడంటూ ఆరోపణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి సమాఖ్య
  • ఆ స్క్రిప్టు తాను రాయలేదన్న ఆది
  • క్షమాపణ చెప్పేందుకు బాధపడనని స్పష్టీకరణ
Hyper Adi offers apologies

ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీనిపై హైపర్ ఆది స్పందించాడు. ఆ టీవీ కార్యక్రమంలో తాను కేవలం ఆర్టిస్టును మాత్రమేనని, ఆ షో స్క్రిప్టు తాను రాయలేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తాను తప్పు చేశానని భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని వెల్లడించాడు.

ఆ టీవీ కార్యక్రమం జరిగే వేళ వేదికపై 20 మంది వరకు నటులు ఉన్నారని, ఆ సమయంలో ఎవరు బతుకమ్మ పాట పాడుతున్నారో, ఎవరు గౌరమ్మ పాట పాడుతున్నారో తెలుసుకోలేమని పేర్కొన్నాడు. తాను పలికిన డైలాగుల్లో తప్పు ఉందని భావిస్తే తనను క్షమించాలని తెలిపాడు. క్షమించాలని అడిగేందుకు తానేమీ బాధపడనని హైపర్ ఆది స్పష్టం చేశాడు.

ఇటీవల ఓ చానల్ లో ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే కార్యక్రమం ఈ వివాదానికి దారితీసినట్టు తెలుస్తోంది.

More Telugu News