నేడు కూడా లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్

15-06-2021 Tue 16:30
  • మరోసారి సరికొత్త గరిష్ఠాలకు సూచీలు
  • రాణించిన బ్యాంకింగ్, మీడియా షేర్లు 
  • 221.52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
  • 57.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Stock Market closes in green

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కొనసాగడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాలతోనే ముగిశాయి. దీంతో సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాలిటీ షేర్లు బాగా రాణించాయి. దీంతో 221.52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52773.05 వద్ద... 57.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15869.25 వద్ద ముగిశాయి.

నేటి సెషన్లో గుజరాత్ గ్యాస్, జీ ఎంటర్ టైన్మెంట్, ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్ఆర్ఎఫ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాలు గడించాయి. ఇక దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్, ఆల్కెమ్ ల్యాబ్, బజాజ్ ఫిన్ సెర్వ్, డా.రెడ్డి ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.