MK Stalin: రోడ్డు పక్కన వృద్ధురాలిని చూసి కాన్వాయ్ ఆపిన తమిళనాడు సీఎం స్టాలిన్

Tamilnadu CM Stalin stops his convoy after spotted a woman on roadside
  • ఇటీవలే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్
  • తాజాగా జిల్లాల్లో పర్యటన
  • తిరుచ్చి వెళుతుండగా ఘటన
  • రోడ్డు పక్కన అర్జీతో నిల్చున్న వృద్ధురాలు
  • అక్కడికక్కడే అధికారులకు స్టాలిన్ ఆదేశాలు
తొలిసారి తమిళనాడు సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి సాధకబాధకాలను తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా సీఎం స్టాలిన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తిరుచ్చి వెళుతున్న సమయంలో రోడ్డు పక్కన అర్జీ పట్టుకుని నిల్చున్న మహిళను చూడగానే ఆయన తన కాన్వాయ్ ఆపించారు. తన వాహనం నిలిపి, ఆ మహిళ నుంచి అర్జీ స్వీకరించారు.

ఆమె సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే ఆ అర్జీపై సంతకం చేసి, దాన్ని అధికారులకు అందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదంతా తన కళ్ల ఎదురుగానే జరగడంతో ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
MK Stalin
Tamilnadu CM
Old Woman
Convoy

More Telugu News