'సన్నాఫ్ ఇండియా' నుంచి లిరికల్ వీడియో రిలీజ్!

15-06-2021 Tue 12:00
  • మోహన్ బాబు హీరోగా 'సన్నాఫ్ ఇండియా'
  • కీలకమైన పాత్రలో శ్రీకాంత్
  • సంగీత దర్శకుడిగా ఇళయరాజా
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
First single from Son of India

మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా 'సన్నాఫ్ ఇండియా' రూపొందుతోంది. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో, విరూపాక్ష పాత్రలో మోహన్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇళయారాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

"జయ జయ మహావీర .. మహాధీర .. " అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ఈ సాంగ్ లో కథానాయకుడు వేంకటేశ్వరస్వామి దీక్షా వస్త్రాలతో కనిపిస్తున్నాడు. భగవంతుడికి ఆయన చేసే ప్రార్ధనే ఈ సాంగ్. ఈ లిరికల్ వీడియోలోనే కథానాయకుడిలోని శాంత స్వభావాన్నీ .. ఆవేశాన్ని అవైష్కరించారు. ఆయన పాత్రలోని వేరియేషన్స్ ను చూపించారు. ఒక షాట్ లో ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నట్టుగా కనిపించారు. అందుకు కారణం  ఏమిటనేది అభిమానుల్లో ఆసక్తిని కలిగించే విషయం.