కరోనా సంక్షోభ సమయంలో ఇంత దుబారా అవసరమా?: తెలంగాణ సర్కారుపై ఏపీ బీజేపీ నేత విమర్శలు

14-06-2021 Mon 20:37
  • తెలంగాణలో అదనపు కలెక్టర్లకు కియా కార్లు
  • ఒక్కో కారు ధర రూ.30 లక్షలు ఉంటుందన్న విష్ణు
  • 32 కార్లు కొని సీఎం ఇంటి వద్ద నిలిపారని వెల్లడి
  • రైతులు, నిరుద్యోగుల కోసం ఖర్చు చేస్తే బాగుండేదని వ్యాఖ్యలు
AP BJP leader Vishnu Vardhan Reddy questions Telangana govt decision

తెలంగాణ ప్రభుత్వం జిల్లాల అదనపు కలెక్టర్లకు కియా కార్నివాల్ కార్లు ఇవ్వాలని నిర్ణయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కూడా స్పందించారు. ఒక్కో కారు ఖరీదు రూ.30 లక్షలు అని, అలాంటివి అధికారుల కోసం 32 కార్లు కొని సీఎం ఇంటి వద్ద కొలువుదీర్చారని వెల్లడించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం డబ్బును దుబారా చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కరోనా కష్టకాలంలో రైతులు, నిరుద్యోగ యువత కోసం ఖర్చు చేయకుండా, ఇలా కార్లు కొనడం ఏంటని ప్రశ్నించారు.