నటుడు హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య

14-06-2021 Mon 18:30
  • ఓ టీవీ షోలో పాల్గొన్న ఆదిపై ఆరోపణలు
  • ఆది అవమానకరంగా మాట్లాడారంటూ ఫిర్యాదు
  • తెలంగాణ సంస్కృతిని కించపరిచారని వెల్లడి
  • మల్లెమాల సంస్థపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
Telangana Jagruthi Students Federation complains against Hyper Adi

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విశేషమైన పాప్యులారిటీని పొందిన నటుడు, కమెడియన్ హైపర్ ఆది చిక్కుల్లో పడ్డారు. ఆయనపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ భాష, యాసలను అవమానించేలా ఓ కార్యక్రమంలో హైపర్ ఆది మాట్లాడారని, బతుకమ్మ పండుగ, గౌరమ్మ వంటి దేవతలను కించపరిచేలా వ్యవహరించారంటూ విద్యార్థి సమాఖ్య నేతలు ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాదులోని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హైపర్ ఆదితో పాటు ఆ కార్యక్రమ రచయిత, షో ప్రొడ్యూసర్ మల్లెమాల సంస్థపైనా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.