'రాజుగారి గది 4'కి రంగం సిద్ధం!

14-06-2021 Mon 17:40
  • యాంకర్ గా ఓంకార్ కి మంచి క్రేజ్
  • దర్శకుడిగాను గుర్తింపు
  • నిరాశపరిచిన 'రాజుగారి గది 3'
  • సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు  
Rajugari Gadhi 4 shooting starts soon

బుల్లితెర నుంచి వెండితెర వైపు వచ్చిన వారిలో ఓంకార్ కూడా కనిపిస్తాడు. దర్శకుడిగా 'రాజుగారి గది' సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. తన సోదరుడు అశ్విన్ బాబు ప్రధాన పాత్రధారిగా ఆయన తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుని ఆయన చేసిన ఈ హారర్ థ్రిల్లర్ లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో ఒక సిరీస్ లా ఆయన ఇదే టైటిల్ పై వరుస కథలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. ఆ దిశగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

నాగార్జున - సమంత ప్రధాన పాత్రధారులుగా ఓంకార్ రూపొందించిన 'రాజుగారి గది 2' ఫరవాలేదనిపించుకుంది. అవికా గోర్ తో చేసిన 'రాజుగారి గది 3' మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత నుంచి కరోనా ఎఫెక్ట్ కారణంగా ఓంకార్ టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక త్వరలో 'రాజుగారి గది 4'ను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయని చెబుతున్నారు.