G Jagadish Reddy: బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోవడం ఖాయం: మంత్రి జగదీశ్ రెడ్డి

Telangana minister Jagadish Reddy comments on Eatala
  • బీజేపీలో చేరిన ఈటల
  • ఈటల మునిగిపోయే నావ ఎక్కారన్న జగదీశ్ రెడ్డి
  • తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలో చేరారని వ్యాఖ్యలు
  • హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేశారని కామెంట్ 
భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవిని పోగొట్టుకుని, ఆపై ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలో ఈటల చేరారని, హుజూరాబాద్ ప్రజలకు ద్రోహం చేశారని అన్నారు. ఈటల వెళ్లినంత మాత్రాన టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని, టీఆర్ఎస్ నుంచి వెళ్లినవారే నష్టపోతారని వివరించారు.

ఈటల రాజేందర్ మునిగిపోయే నావ ఎక్కారని, బీజేపీతో పాటు ఈటల కూడా మునిగిపోతారని వ్యాఖ్యానించారు. సొంత అజెండాతోనే ఈటల బీజేపీలో చేరారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పద అంశమని, ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని పేర్కొన్నారు.
G Jagadish Reddy
Eatala Rajendar
BJP
TRS
Telangana
Huzurabad

More Telugu News