Chandrababu: భూఆక్రమణలపై చిత్తూరు క‌లెక్ట‌ర్‌కు చంద్ర‌బాబు నాయుడు లేఖ‌

chandrababu writes letter to collector
  • పూత‌లప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లపై లేఖ‌
  • వైసీపీ నేత‌లే భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారు
  • గుడిసెలు, నిర్మాణాల‌తో ఆక్ర‌మ‌ణ‌ల‌కు ప్ర‌య‌త్నాలు
పూత‌లప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయంటూ చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ నేత‌లే భూ ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. చివ‌ర‌కు పాఠ‌శాల మైదాన స్థలాన్నీ ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

గుడిసెలు, నిర్మాణాల‌తో ఆక్ర‌మ‌ణ‌ల‌కు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఆక్ర‌మ‌ణదారుల‌పై చ‌ట్ట‌బద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ను ఆయ‌న కోరారు. పూత‌లప‌ట్టు మండ‌లం పాల‌కూరులో భూఆక్ర‌మ‌ణ‌లపై ప‌లు అంశాల‌ను చంద్ర‌బాబు ఈ లేఖ‌లో వివ‌రించారు.
Chandrababu
Telugudesam
Chittoor District

More Telugu News