Vijay: 'మాస్టర్' దర్శకుడితో మరోసారి విజయ్!

Vijay another movie with Master director
  • మాస్ లో విజయ్ కి విపరీతమైన క్రేజ్
  • 'మాస్టర్'తో లభించిన భారీ హిట్
  • మరోసారి పట్టాలపైకి వెళ్లే ఛాన్స్  
తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయనకి అక్కడ మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. అందువలన తన కథల్లో మాస్ ఆడియన్స్ కి అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉండేలా ఆయన చూసుకుంటారు. ఈ కారణంగానే తమిళనాట వసూళ్ల విషయంలో విజయ్ సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ మధ్య వచ్చిన 'మాస్టర్' సినిమా కూడా కొత్త రికార్డులను సృష్టించింది. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టింది.

విజయ్ కి గల క్రేజ్ .. అంతకుముందు లోకేశ్ కనగరాజ్ 'ఖైదీ' హిట్ ఇచ్చి ఉండటం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 'మాస్టర్' షూటింగు సమయంలోనే తనతో మరో సినిమా చేయాలని విజయ్ అన్నాడట. కమల్ తో 'విక్రమ్' సినిమా పూర్తయిన తరువాత చేద్దామని లోకేశ్ కనగరాజ్ చెప్పాడట. అయితే 'విక్రమ్' ప్రాజెక్టు ఆలస్యం కానుండటంతో, విజయ్ సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో లోకేశ్ కనగరాజ్ ఉన్నాడని అంటున్నారు.
Vijay
Lokesh Kanagaraj

More Telugu News