rain: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

  • హైద‌రాబాద్ లో ప‌లు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి వాన‌
  • రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్‌లోనూ వ‌ర్షం
  • అత్యధికంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీమీటర్ల వర్షపాతం
  • రామగుండం రీజీయన్‌లో నిలిచిన‌ బొగ్గు ఉత్ప‌త్తి  
rains in ts

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో గ‌త‌ రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. హైద‌రాబాద్ స‌హా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్‌, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో వ‌ర్షాలు ప‌డ్డాయి. హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. వ‌ర్షాల‌కు ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.

తెలంగాణ‌లో అత్యధికంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీ మీటర్ల వర్షపాతం న‌మోద‌యింది. రామగుండం రీజీయన్‌లో బొగ్గు ఉత్ప‌త్తి నిలిచిపోయింది. అలాగే, ఈ రోజు నల్ల‌గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

More Telugu News