Koratala Siva: కొరటాల బర్త్ డే స్పెషల్ గా రానున్న 'ఆచార్య' సెకండ్ సింగిల్?

Fans are waiting for Acharya second single on Koratala birthday
  • అపజయమెరుగని కొరటాల
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో
  • అభిమానుల వెయిటింగ్  
కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిరంజీవి - కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ .. జనంలోకి దూసుకెళ్లింది. అప్పటి నుంచి ఆభిమానులంతా సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. రేపు కొరటాల పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రావొచ్చనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఫస్టు సింగిల్ వచ్చి చాలా రోజులు కావడం వలన, సెకండ్ సింగిల్ వదిలే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.

ఇక కొరటాల తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. అందువలన ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్ డేట్ కూడా రావొచ్చని ఎన్టీఆర్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఇటు మెగా అభిమానులు.. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించినట్టుగా ఈ రెండు సినిమాల నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. ఇంతవరకూ కొరటాల చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను అందుకున్నాయి. పరాజయమనేది ఆయనకి తెలియదు. అందువలన సహజంగానే ఆయన సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
Koratala Siva
Chiranjeevi
Junior NTR

More Telugu News