బర్త్ డే పార్టీలో చిందులేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. పోలీసుల అదుపులో యువతీయువకులు!
- రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఘటన
- రేవ్ పార్టీని మించిపోయిన బర్త్ డే సెలబ్రేషన్స్
- 67 మంది యువతీ యువకుల అరెస్ట్
- పరారీలో ప్రధాన నిందితుడు
సమాచారం అందుకున్న కడ్తాల్ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫాం హౌస్‌పై దాడి చేసి నిర్వాహకులతోపాటు మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు కాగా, మిగతా వారిలో 21 మంది యువతులు, 43 మంది యువకులు ఉన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ పరారయ్యాడు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన యువతీయువకులను ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పార్టీ వీడియోలు రేవ్ పార్టీకి మించిపోయి ఉండడం గమనార్హం.