ముంబయిలో నమ్మశక్యం కాని ఘటన... కుంగిన భూమిలోకి జారిపోయిన కారు
- ముంబయిలో భారీ వర్షాలు
- ఎక్కడ చూసినా నీళ్లే
- ఘట్కోపర్ ప్రాంతంలో కుంగిన భూమి
- అదే ప్రదేశంలో కారు పార్కింగ్
- నిట్టనిలువుగా మునిగిన కారు
దీనిపై ముంబయి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఆ కారు నిలిపి ఉంచిన ప్రాంతంలో ఒకప్పుడు బావి ఉండేదని, కాలక్రమంలో దాన్ని మట్టితో నింపేశారని తెలిపారు. కొందరు దానిపై కాంక్రీట్ వేసి పార్కింగ్ ఏరియాగా మార్చుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో, భూమి కుంగిపోయి ఉంటుందని వివరించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.