అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క భేటీ

13-06-2021 Sun 13:23
  • గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత అంశాల‌పై  చ‌ర్చ‌
  • పల్లె, పట్టణ ప్రగతి అమలు, పనుల పురోగ‌తి వివ‌రాలు అడుగుతోన్న కేసీఆర్
  • తదుపరి లక్ష్యాలపై  దిశానిర్దేశం  
kcr meeting with collectors

గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠ ధామాల‌కు సంబంధించిన అంశాల‌పై చర్చించేందుకు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ త‌న అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పల్లె, పట్టణ ప్రగతి అమలు, పనుల పురోగ‌తి వంటి అంశాల గురించి, వాటిల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆయ‌న‌ అడిగి తెలుసుకుంటున్నారు.

ఆయా కార్య‌క్ర‌మాల‌ తదుపరి లక్ష్యాలపై  దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల‌కు ఆర్థిక సంఘంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపుల వ‌ల్ల నిధులు స‌మ‌కూరుతోన్న విష‌యం తెలిసిందే. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యాయి. పల్లె, పట్టణ ప్రగతి అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఇప్పటికే కేసీఆర్‌ ప్రకటించిన విష‌యం తెలిసిందే. గ్రామాలు, మండలాల వారీగా చార్టులు రూపొందించాలని ఆదేశించారు.