Brazil: బైక్​ ర్యాలీలో మాస్క్​ ధరించనందుకు బ్రెజిల్​ అధ్యక్షుడికి జరిమానా!

Brazil President Fined for Not Wearing The Mask in Bike Rally in Sao Paulo
  • వంద డాలర్లు ఫైన్ వేసిన సావో పాలో గవర్నర్
  • కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ
  • పెద్ద సంఖ్యలో ప్రజలను గుమిగూడేలా చేశారని ఫైర్
బ్రెజిల్ అధ్యక్షుడికి జరిమానా పడింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు, మాస్క్ పెట్టుకోనందుకు, భౌతిక దూరం నిబంధనలను పెడచెవిన పెట్టినందుకుగానూ ఆయనకు 100 డాలర్ల జరిమానా వేశారు. ఇవ్వాళ ఆయన సావో పాలోలో భారీ బైక్ ర్యాలీ తీశారు. ‘యాక్సిలరేట్ ఫర్ క్రైస్ట్’లో భాగంగా నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు.


ఆ ర్యాలీలో స్వయంగా బైక్ నడిపిన బోల్సోనారో ఓపెన్ ఫేస్ హెల్మెట్ పెట్టుకున్నారు. మాస్కును మాత్రం మరిచారు. అది సావో పాలో నిబంధనలకు విరుద్ధమన్న గవర్నర్ జొవావో డోరియా ఫైన్ వేశారు. వచ్చే ఏడాది ఎన్నికలుండడంతో ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించిన బోల్సోనారో బైక్ ర్యాలీ తీశారు.

అయితే, రాజకీయ ప్రత్యర్థి అయిన డోరియా.. ర్యాలీ తీయొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా ఆయన ర్యాలీకి వెళ్లారు. వాస్తవానికి ముందు నుంచీ ఇంట్లో ఉండడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నారు.
Brazil
Zair Bolsonaro
COVID19
Mask

More Telugu News