బెంగాల్‌లో బీజేపీకి వరుస షాకులు.. టీఎంసీ నేతతో రాజీబ్ బెనర్జీ భేటీ
- ముకుల్ రాయ్ బీజేపీని వీడిన తర్వాతి రోజే టీఎంసీ నేతను కలిసిన రాజీబ్ బెనర్జీ
- మర్యాద పూర్వక భేటీయేనన్న ఇరువురు నేతలు
- ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారికి ప్లేస్ లేదన్న మమత
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డోమ్జూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన రాజీబ్ బెనర్జీ ఓటమి పాలయ్యారు. టీఎంసీ అధికార ప్రతినిధి అయిన కునాల్ ఘోష్‌ను నిన్న కోల్‌కతాలో ఆయన నివాసంలోనే కలిశారు. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని ఇరువురు నేతలు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు తథ్యమని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్-మే నెలల్లో పార్టీ వీడిన నేతలు, కార్యకర్తలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం గమనార్హం.