Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణకు వర్ష సూచన

  • వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • రాగల రెండ్రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
  • తెలంగాణ అంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు
Rain alert for Telangana

బంగాళాఖాతం వాయవ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వివరించింది. ఇది రాగల రెండు, మూడు రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశలో ఝార్ఖండ్, ఒడిశా, నార్త్ చత్తీస్ గఢ్ ప్రాంతాల మీదుగా పయనిస్తుందని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రాగల రెండ్రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 6 ఉమ్మడి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అటు, నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

More Telugu News