Corona Virus: మరిన్ని కొత్త కరోనా వైరస్‌లను గుర్తించిన చైనా!

Chinese researchers found new batch of coronaviruses
  • గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లు
  • మొత్తం 24 రకాల కరోనా వైరస్‌ల గుర్తింపు
  • కొన్ని సార్స్‌-కొవ్‌-2ను పోలి ఉన్నాయి 
  • గబ్బిలాల్లోనే కరోనా వైరస్‌లు సంచరిస్తున్నట్లు నిర్ధారణ
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మూలాలపై లోతైన పరిశోధన జరగాల్సిందేనని ప్రపంచ దేశాలు చైనాపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో డ్రాగన్‌ దేశం ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. తాము గబ్బిలాలపై జరిపిన పరిశోధనల్లో కరోనా ఫ్యామిలీకి చెందిన మరికొన్ని వైరస్‌లను కనుగొన్నట్లు తెలిపింది.

వీటిలో కొన్ని ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న సార్స్‌-కొవ్‌-2కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నట్లు చైనా పరిశోధకులు తెలిపారు. నైరుతి చైనాలో గబ్బిలాలపై జరిపిన పరిశోధనలతో ఎన్ని రకాల కరోనా వైరస్‌లు ఉన్నాయి? వీటిలో ఎన్నింటికి మనుషులకు సోకే సామర్థ్యం ఉందో? తేలనుందన్నారు.  మొత్తం 24 రకాల కరోనా వైరస్‌లను గుర్తించామని.. వీటిలో నాలుగు సార్స్‌-కొవ్‌-2కు దగ్గరగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘సెల్‌’ అనే జర్నల్‌లో అధ్యయన ఫలితాలను ప్రచురించారు.

మే, 2019-నవంబరు 2020 మధ్య అడవిలో ఉండే చిన్న గబ్బిలాల మూత్రం, విసర్జితాలు, వాటి నోటి నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించి కొత్త కరోనా వైరస్‌లను గర్తించినట్లు తెలిపారు. స్పైక్‌ ప్రోటీన్‌పై ఉండే జన్యు క్రమాన్ని మినహాయిస్తే వీటిలో ఒక వైరస్‌ పూర్తిగా సార్స్‌-కొవ్‌-2ను పోలి ఉందని పరిశోధకులు తెలిపారు. 2020 జూన్‌లో థాయ్‌లాండ్‌లోనూ సార్స్‌-కొవ్‌-2ను పోలిన కరోనా వైరస్‌ను గుర్తించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీంతో పాటు తాజాగా గుర్తించిన వైరస్‌లను పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్‌ గబ్బిలాల్లో సంచరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
Corona Virus
China
News Corona virus
Bats

More Telugu News