హిందీ రీమేక్ దిశగా 'అల వైకుంఠపురములో'
- తెలుగులో సూపర్ హిట్
- మ్యూజికల్ హిట్ గా నిలబెట్టిన తమన్
- బన్నీ కెరియర్లోనే భారీ వసూళ్లు
- కార్తీక్ ఆర్యన్ కు జోడీగా కృతి సనన్
'అల వైకుంఠపురములో' సినిమాను ఏ భాషలోనైనా రీమేక్ చేసుకోవచ్చు. కథాకథనాల పరంగా .. నేపథ్యం పరంగా అలాంటి సౌలభ్యం ఉంది. అందువలన హిందీలో రీమేక్ చేయడానికి అల్లు అరవింద్ రెడీ అవుతున్నారని అంటున్నారు. తెలుగులో అల్లు అర్జున్ చేసిన పాత్రలో కార్తీక్ ఆర్యన్ ను .. పూజ హెగ్డే చేసిన పాత్రలో కృతి సనన్ ను అనుకుంటున్నారట. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఈ లోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.