నేనూ రైతునే అని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కు వీరి బాధలు పట్టవా?: షర్మిల
- తెలంగాణలో ప్రజా సమస్యలపై గళం విప్పిన షర్మిల
- విమర్శల్లో పదును పెంచిన వైనం
- కేసీఆర్ లక్ష్యంగా మరోసారి వ్యాఖ్యలు
- రైతుపై ఎందుకంత కక్ష? అని ఆగ్రహం
నేనూ రైతునే అని చెప్పుకునే కేసీఆర్ కు రాష్ట్రంలోని రైతుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుపై ఎందుకంత కక్ష? అని నిలదీశారు. తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు పడుతున్న కష్టాలు చూసి కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరవాలని షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను రైతులను కలిసినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.