Pavan Kalyan: పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

Manasa Radhakrishnan gave a clarity on Pavan movie
  • పవన్ తో హరీశ్ శంకర్ మూవీ
  • మైత్రీ బ్యానర్లో మొదలైన సన్నాహాలు  
  • హీరోయిన్ మానస రాధాకృష్ణన్ అంటూ టాక్
  • పవన్ అంటే ఇష్టమని చెప్పిన మానస  
మలయాళ కథానాయికలలో మానస రాధాకృష్ణన్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే తెలుగులో ఇంతవరకూ ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ హఠాత్తుగా టాలీవుడ్ లో ఆమె పేరు వినిపించింది. అదీ పవన్ సినిమాకి సంబంధించి కావడంతో, అందరి నోళ్లలో ఆమె పేరు నానుతోంది. ఆమె గురించి తెలియనివారు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

పవన్ కల్యాణ్ తో హరీశ్ శంకర్ ఒక సినిమాను చేయనున్నాడనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ఎవరు చేయనున్నారనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'మానస రాధాకృష్ణన్' అనే మలయాళ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

ఈ సినిమా కోసం ఆమెను ఎంపిక చేయనున్నారనే టాక్ స్పీడ్ అందుకుంది. దాంతో ఈ విషయంపై ఆమెనే నేరుగా స్పందించింది. "నాకు పవన్ కల్యాణ్ గారు అంటే చాలా ఇష్టం .. కానీ ఆయన సినిమాలో నేను చేయడం లేదు" అని ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఏ విషయమైనా తామే అధికారికంగా వెల్లడిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ వారు చెప్పిన సంగతి తెలిసిందే.
Pavan Kalyan
Harish Shankar
Manasa Radhakrishnan

More Telugu News