జూన్‌ 26న రాజ్‌భవన్‌ల ముట్టడి: కిసాన్‌ సంయుక్త మోర్చా

11-06-2021 Fri 21:55
  • కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
  • ఇంకా కొనసాగుతున్న ఉద్యమం
  • జూన్‌ 26నే సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ దినం
  • గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి మొమోరాండం
Rajbhavan Gherao on june 26

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్‌ 26న రైతులు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో గవర్నర్‌ నివాసాలైన రాజ్‌భవన్‌లను ముట్టడించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. ఆరోజు ‘సేవ్‌ ఫార్మింగ్‌, సేవ్‌ డెమోక్రసీ’ దినంగా పాటించనున్నట్లు వెల్లడించింది. అలాగే గవర్నర్ల ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మొమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపింది.

రైతుల సంక్షేమమే థ్యేయమంటూ కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 26న పరిస్థితులు విపరీత పరిణామాలకూ దారి తీశాయి. అయినా రైతులు మాత్రం తమ తమ ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.