Chandrasekhar: ఇసుక రీచ్ ల మోసాలు... చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests Visakha resident Chandrasekhar
  • ఇసుక రీచ్ ల పేరిట ఘరానా మోసం
  • ఏకంగా సీఎం జగన్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనం
  • నిందితుడిది విశాఖ అని గుర్తించిన పోలీసులు
  • ఓ వ్యక్తి నుంచి రూ.2 కోట్లు వసూలు
ఏపీ ఇసుక రీచ్ లు ఇప్పిస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడిన చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ విశాఖకు చెందినవాడు. ఇసుక రీచ్ ల పేరిట చంద్రశేఖర్ కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు. చంద్రశేఖర్ మోసాలకు పాల్పడే క్రమంలో ఏకంగా సీఎం జగన్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం గమనార్హం. సీఎంతో పాటు ఆయన ఓఎస్డీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పలువురిని సులువుగా మోసగించాడు.

కర్రి సురేంద్రనాథ్ అనే వ్యక్తి నుంచి ఇసుక రీచ్ ల పేరిట రూ.2 కోట్లు వసూలు చేసినట్టు డీసీపీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. నిందితుడు చంద్రశేఖర్ పై గతంలో హైదరాబాదులోని సైఫాబాదులోనూ ఓ కేసు నమోదైనట్టు తెలిసిందని డీసీపీ పేర్కొన్నారు. మరికొంతమందిని కూడా ఇసుకరీచ్ ల పేరిట మోసగించినట్టు తెలిసిందని, దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించామని తెలిపారు.
Chandrasekhar
Sand Reach
Cheating
Police
Andhra Pradesh

More Telugu News