Sensex: రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్ , నిఫ్టీ

  • జీవన కాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్, నిఫ్టీ
  • 52,475 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 3 శాతానికి పైగా లాభపడ్డ డాక్టర్ రెడ్డీస్
Sensex and Nifty ends at record high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరో మైలురాయిని దాటాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఐటీ, మెటల్ స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 52,475కి పెరిగింది. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 15,799 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.97%), టీసీఎస్ (1.73%), ఇన్ఫోసిస్ (1.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.54%).

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-1.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.80%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.78%), భారతి ఎయిర్ టెల్ (-0.76%), యాక్సిస్ బ్యాంక్(-0.70%).

More Telugu News