'బింబిసార'లో ఎన్టీఆర్ వాయిస్!

11-06-2021 Fri 17:05
  • చారిత్రక నేపథ్యంలో 'బింబిసార'
  • భారీ బడ్జెట్ తో కల్యాణ్ రామ్
  • స్క్రిప్ట్ దశ నుంచి ఎన్టీఆర్ సూచనలు
  • ప్రమోషన్స్ పరంగాను హెల్ప్  
Ntr voice over in Bimbisara

కల్యాణ్ రామ్ ఇంతవరకూ సాంఘిక చిత్రాలలో నటిస్తూ .. నిర్మిస్తూ వచ్చాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన పెద్ద రిస్క్ తీసుకున్నాడు. చారిత్రక నేపథ్యంలో కూడిన 'బింబిసార' కథను ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తన సొంత బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా, ఆయన వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. అప్పటికే చాలావరకూ షూటింగు పూర్తయిందని అంటున్నారు.

మొదటి నుంచి కూడా ఈ సినిమా విషయంలో కల్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. కల్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కథను వినడం, మూలకథ దెబ్బతినకుండా మార్పులు .. చేర్పులు సూచించడం చేశాడట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 'వాయిస్ ఓవర్' ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. కథ మలుపు తిరిగే క్రమంలో ఆయన వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ సమయంలోను తన వంతు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.