ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీలో రాశి ఖన్నా!

11-06-2021 Fri 11:18
  • తెలుగులో రెండు సినిమాలు
  • తమిళంలో అరడజను సినిమాలతో బిజీ
  • హిందీ వెబ్ సిరీస్ పై ఆశలు
  • నాగ్ అశ్విన్ మూవీలో ఛాన్స్
Rashii Khanna in Prabhas movie

నిన్నమొన్నటి వరకూ కెరియర్ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చిన రాశి ఖన్నా, 'ఆలస్యం అమృతం విషం' అన్నట్టుగా ఇటీవల జోరు పెంచింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉండగా, తమిళంలో అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా విభిన్నమైనవే .. పెద్ద బ్యానర్లలో నుంచి వచ్చేవే. ఇక హిందీ వెబ్ సిరీస్ లోను ఈ సుందరి బిజీగానే ఉంది. ఇలా రాశి ఖన్నా గ్లామర్ తోనే ఎడా పెడా అవకాశాలను అందుకుంటోంది. తాజాగా ప్రభాస్ ప్రాజెక్టులోను అవకాశాన్ని అందుకుందని అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ .. 'సలార్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత ఆయన 'ఆది పురుష్' ప్రాజెక్టు పైకి రానున్నాడు. ఆ వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది. కీలకమైన పాత్రల కోసం వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ అమితాబ్ .. దీపికా పదుకొణే పేర్లు ఖాయమైపోయాయి. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రాశి ఖన్నాను తీసుకున్నారనేది తాజాగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.