బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూకట్ పల్లిలో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన అభిమానులు

10-06-2021 Thu 18:27
  • నేడు బాలయ్య జన్మదినం
  • అభిమానుల వ్యాక్సినేషన్ డ్రైవ్
  • 500 మందికి ఉచితంగా కరోనా టీకాలు
  • హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
Fans organize corona vaccination drive on Balakrishna birthday

నందమూరి కథానాయకుడు బాలకృష్ణ ఇవాళ (జూన్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు హైదరాబాదులో సామాజిక సేవా కార్యక్రమం చేపట్టారు. తమ అభిమాన హీరో బాలయ్య బర్త్ డేని పురస్కరించుకుని కూకట్ పల్లిలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. 500 మందికి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ డోసులు అందించారు. కాగా, ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్), రామ్ అచంట (14 రీల్స్ ప్లస్) ముఖ్య అతిథులుగా విచ్చేశారు.