సంక్రాంతి బరిలోకి పవన్ రీమేక్ మూవీ!

10-06-2021 Thu 17:05
  • సెట్స్ పై ప్రస్తుతం రెండు సినిమాలు
  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • త్వరలో మొదలుపెట్టే ఆలోచన
  • విడుదల మరింత ఆలస్యం  
Pavan and Sagar Chandra movie released on Sankranthi

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత నుంచి స్పీడ్ పెంచారు. వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళుతున్నారు. ఆల్రెడీ ఆయన సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న 'హరి హర వీరమల్లు' అయితే, మరొకటి సాగర్ కె.చంద్ర దర్శకత్వంలోని 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్. ఈ రెండు సినిమాలలో మలయాళ రీమేక్ ను ఈ ఏడాది చివరిలో విడుదల చేసి, 'హరిహర వీరమల్లు' సినిమాను మాత్రం సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.

అయితే కరోనా కారణంగా ముందుగా అనుకున్నట్టుగా షూటింగు జరగలేదు. షూటింగు పరంగా జరిగిన ఆలస్యం ఈ సినిమా విడుదలపై పడనుంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా షూటింగు మొదట్లోనే ఉంది. 'హరిహర వీరమల్లు' భారీ బడ్జెట్ తో కూడినది కావడం వలన సమయం ఎక్కువ తీసుకుంటుంది. అందువలన ఈ రెండు సినిమాల విడుదల పరిస్థితిపై అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ చేస్తున్న రీమేక్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని అంటున్నారు. ఇక 'హరి హర వీరమల్లు'ను మాత్రం వేసవి సెలవుల్లో రిలీజ్ చేయవచ్చని చెబుతున్నారు.