Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: ప్రాక్టీసు ప్రారంభించిన టీమిండియా

  • ఈ నెల 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ కివీస్
  • వార్మప్ మ్యాచ్ లు లేకుండానే బరిలో దిగనున్న భారత్
  • ప్రాక్టీసు సెషన్లలో చెమటోడ్చాలని నిర్ణయం
Team India starts practice for WTC Final against New Zealand

ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో సౌతాంఫ్టన్ మైదానంలో కసరత్తులు, నెట్ ప్రాక్టీసు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియో పంచుకుంది.

భారత్ నుంచి ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మొదట 3 రోజుల పాటు క్వారంటైన్ లో గడిపారు. ఆపై బృందంగా కాకుండా, ఒక్కొక్కరుగా మైదానంలో సాధన చేశారు. అనంతరం తొలిసారిగా బృందంగా ప్రాక్టీసు చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ నేడు ప్రారంభమైంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ నాటికి కివీస్ కు సరైన మ్యాచ్ ప్రాక్టీసు లభిస్తుండగా, భారత్ కు కనీసం వార్మప్ మ్యాచ్ లు ఆడే అవకాశం లేకపోయింది. దాంతో ఈ నెల 18న నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అందుకే ప్రాక్టీసు సెషన్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.

More Telugu News