Chandrababu: ఘంటసాల తనయుడు రత్నకుమార్ ఆకస్మిక మరణం విషాదకరం: చంద్రబాబు

Chandrababu condolences Ghantasala Ratnakumar sudden demise
  • గుండెపోటుకు గురైన రత్నకుమార్
  • చెన్నైలో ఈ ఉదయం కన్నుమూత
  • కొన్నిరోజులుగా కరోనా చికిత్స పొందిన వైనం
  • కిడ్నీ సమస్యతోనూ బాధపడుతున్న రత్నకుమార్
గాయక దిగ్గజం ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. రత్నకుమార్ ఇటీవల కొన్నిరోజుల పాటు కరోనా చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగెటివ్ వచ్చింది. అయితే, ఆయన కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు.

రత్నకుమార్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మరణం విషాదకరం అని పేర్కొన్నారు. పలు భాషల్లో 1000కి పైగా సినిమాలకు డబ్బింగ్ కళాకారుడిగానూ, 30 చిత్రాలకు మాటల రచయితగానూ పనిచేసిన రత్నకుమార్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని నివాళులర్పించారు. "రత్నకుమార్ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.
Chandrababu
Ghantasala Ratnakumar
Demise
Condolences

More Telugu News