కొవాగ్జిన్ కు జీఎంపీ అనుమతులు మంజూరు చేసిన బ్రెజిల్
- గతంలో కొవాగ్జిన్ కు బ్రెజిల్ అనుమతి నిరాకరణ
- నాణ్యతా ప్రమాణాలపై అసంతృప్తి
- మరోసారి కీలక డేటాతో దరఖాస్తు చేసిన భారత్ బయోటెక్
- ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అన్విసా
తాజాగా, కొవాగ్జిన్ సరైన నాణ్యతా ప్రమాణాలతో తయారైన వ్యాక్సిన్ అంటూ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ 'అన్విసా' జీఎంపీ అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాదులో ఉన్న భారత్ బయోటెక్ ప్రధాన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ కు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఉపయోగించే ఫార్మా ముడి పదార్థానికి బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ఈ మేరకు ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. తాజా అనుమతులతో భారత్ నుంచి బ్రెజిల్ కు కొవాగ్జిన్ ఎగుమతులకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. అన్విసా జారీ చేసిన అనుమతులు రెండేళ్ల పాటు అమలులో ఉంటాయి.