అమిత్​ షాతో ఎటువంటి డీలూ చేసుకోలేదు: జితిన్​ ప్రసాద

10-06-2021 Thu 13:55
  • కాంగ్రెస్ లో రాజకీయాలెక్కువ
  • ప్రజలకు సేవ చేయలేం
  • బీజేపీ సంస్థాగత పార్టీ
  • అందుకే బీజేపీలోకి వచ్చానని కామెంట్
Amit Shah Offered me Nothing Says Jitin Prasada

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను ఎటువంటి డీలూ కుదుర్చుకోలేదని బీజేపీ నేత జితిన్ ప్రసాద అన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన ఆయన నిన్ననే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాను పార్టీని వీడడానికి పార్టీలో నాయకత్వ లోపంగానీ, రాహుల్ గాంధీగానీ కారణం కాదన్నారు. కాంగ్రెస్ లో ఉండి ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని, ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.
 
అమిత్ షాతోగానీ, జేపీ నడ్డాతోగానీ ఎలాంటి డీల్ చేసుకోలేదని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని చెప్పారు. తాను ఇప్పటిదాకా రాజకీయాలు చుట్టుముట్టిన పార్టీలో ఉన్నానని, కాబట్టి అందులో ఉండి ప్రజలకు సేవ చేయలేనని భావించానని చెప్పారు. బీజేపీ సంస్థాగతంగా నిర్మితమైన పార్టీ అని అన్నారు. మిగతా పార్టీలన్నీ వ్యక్తి చుట్టూ తిరిగేవేనని మరోమారు స్పష్టం చేశారు.