క‌రోనాపై కేంద్ర ప్ర‌భుత్వ పోరాటం అభినంద‌నీయం: జేపీ న‌డ్డా

10-06-2021 Thu 12:56
  • మ‌న దేశం ఎంత శ‌క్తిమంత‌మైందో స్ప‌ష్ట‌మ‌వుతోంది
  • దేశంలో గ‌త ఏడాది కేవ‌లం ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేది
  • ఇప్పుడు దేశంలో 2500 ల్యాబులు ఉన్నాయి
  • ఒకే రోజు 25 ల‌క్ష‌ల  శాంపిళ్ల‌ను ప‌రీక్షిస్తున్నారు
jp nadda praises govt

క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటోన్న చ‌ర్య‌లు అభినంద‌నీయమ‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా చెప్పుకొచ్చారు. ఈ రోజు అరుణాచ‌ల్ ప్రదేశ్ లో బీజేపీ కార్యాల‌య భ‌వనాన్ని ప్రారంభించిన నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడారు.  

'క‌రోనాపై పోరాటానికి కేంద్ర ప్ర‌భుత్వం సంసిద్ధ‌మైన తీరు ప్ర‌శంస‌నీయం.. మ‌న దేశం ఎంత శ‌క్తిమంత‌మైందో దీని ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది.. దేశంలో గ‌త ఏడాది కేవ‌లం ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేది. అలాగే, 1,500 న‌మూనాలు ప‌రీక్షించే సామ‌ర్థ్యం మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు దేశంలో ఒకే రోజు 25 ల‌క్ష‌ల  శాంపిళ్ల‌ను ప‌రీక్షిస్తున్నారు. ఇప్పుడు దేశంలో 2500 ల్యాబులు ఉన్నాయి' అంటూ జేపీ న‌డ్డా చెప్పుకొచ్చారు.