Sensex: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 333 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 104 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 1.80 శాతం నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈరోజూ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 333 పాయింట్లు నష్టపోయి 51,941కి పడిపోయింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమై 15,635కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.42%), ఎన్టీపీసీ (1.72%), టైటాన్ కంపెనీ (0.98%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.50%), ఏసియన్ పెయింట్స్ (0.44%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.80%), ఎల్ అండ్ టీ (-1.79%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.46%), బజాజ్ ఫైనాన్స్ (-1.43%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.33%).

More Telugu News