భారత వృద్ధి రేటు అంచనాలను కుదించిన ప్రపంచ బ్యాంకు!
- 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కోత
- 2022-23లో జీడీపీ 7.5 శాతం
- 2023-24లో జీడీపీ 6.5 శాతం
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.6 శాతం
కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థను రెండో దశ తీవ్రంగా దెబ్బతీసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జీడీపీ అంచనాల్ని కుదించాల్సి వచ్చిందని వివరించింది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సంలో 5.6 శాతంగా ఉండనున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వృద్ధిని పోత్సహిస్తూ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై చేసే వ్యయం, గ్రామీణ ప్రాంతాల్లో చేసే అభివృద్ధి పనుల వంటి చర్యలు వృద్ధి రేటుకు ఊతమివ్వనున్నట్లు పేర్కొంది.