బాలకృష్ణ అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి!

08-06-2021 Tue 18:41
  • ఈ నెల 10వ తేదీన బాలకృష్ణ బర్త్ డే
  • గోపీచంద్ మలినేనితో సినిమా లాంచ్
  • అనిల్ రావిపూడి ప్రాజెక్టు ఎనౌన్స్ మెంట్
  • దసరాకి రానున్న 'అఖండ'  
Balakrishna fans are excited

బాలకృష్ణ అభిమానులంతా ఈ నెల 10వ తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .. ఎందుకంటే ఆ రోజున ఆయన పుట్టినరోజు. బాలకృష్ణ బర్త్ డే రోజున ఆయన తదుపరి సినిమాలకి సంబంధించిన అప్ డేట్ వస్తుందని వాళ్లంతా భావిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని గోపీచంద్ మలినేని చెప్పడంతో, అంచనాలు పెరిగిపోయాయి.

బాలకృష్ణ పుట్టినరోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. చాలా తక్కువమందితో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. అలాగే అనిల్ రావిపూడితో చేయనున్న సినిమాను గురించి కూడా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ' రూపొందుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.