ఆగస్టులోనే 'లవ్ స్టోరీ' చూపిస్తారట!

08-06-2021 Tue 17:29
  • శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
  • కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా
  • ఆగస్టులో విడుదల చేసే ఆలోచన

Love Story is going to release on August

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. సున్నితమైన భావోద్వేగాలతో ఆయన ప్రేమకథలు కొనసాగుతాయి. అందుకే యూత్ లో ఆయన సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన తాజా చిత్రంగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసివుంది. అయితే మిగతా సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా వాయిదా వేసుకుంది.

ఏప్రిల్ నుంచి మే నెలకి వాయిదా పడిన ఈ సినిమా, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అలా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుతున్నట్టుగా కనిపిస్తూ ఉండటంతో, ఆగస్టులో విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. సాయిపల్లవిపై చిత్రీకరించిన 'సారంగధరియా ..' పాట ఇప్పటికే పాప్యులర్ అయింది .. సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.