బీజేపీ టీకాలకే మేం వ్యతిరేకం.. ప్రభుత్వ వ్యాక్సిన్​ మాత్రం వేసుకుంటా: అఖిలేశ్​ యాదవ్​

08-06-2021 Tue 11:18
  • కేంద్ర టీకా విధానంపై సెటైర్లు
  • జనాగ్రహం తట్టుకోలేకే ప్రకటించారని కామెంట్
  • అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపు
Against BJP Vaccine Now I take Indian Govt Vaccine Says Akhilesh Yadav

జనాగ్రహాన్ని తట్టుకోలేకే అందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలంటించారు. ఈరోజు ఉదయం ఆయన కేంద్ర ప్రభుత్వ టీకా విధానాలపై ట్వీట్ చేశారు. తాను బీజేపీ వ్యాక్సిన్లకు మాత్రమే వ్యతిరేకమని, భారత ప్రభుత్వ టీకాలనే తాను వేసుకుంటానని అన్నారు.

ఇక, తానూ వ్యాక్సిన్ వేసుకుంటానని, టీకాల్లేక ఇప్పటిదాకా వేసుకోని వాళ్లూ ముందుకొచ్చి వ్యాక్సిన్లు వేసుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.