Dhanush: రజనీకాంత్ స్టైల్ ను అనుకరించానంటున్న ధనుశ్!

Dhanush followed Rajani style in Jagame Thanthiram
  • ధనుశ్ హీరోగా 'జగమే తంతిరం'
  • మాఫియా నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్
  • తెలుగు టైటిల్ గా 'జగమే తంత్రం  
తమిళనాట ధనుశ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ మధ్య కాలంలో వరుసగా విభిన్నమైన చిత్రాలను చేస్తూ, విజయాలను అందుకుంటున్నాడు. ఒక వైపున విజయ్ .. మరో వైపున అజిత్ పోటీని తట్టుకుని నిలబడుతూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'కర్ణన్' కూడా భారీ వసూళ్లను రాబట్టింది. నటనపరంగా ధనుశ్ కి ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన 'జగమే తంతిరం'ను నెట్ ఫ్లెక్స్ లో ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు. ధనుశ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుశ్ మాఫియా డాన్ గా నటించాడు. తెలుగులో ఈ సినిమాకి 'జగమే తంత్రం' అనే టైటిల్ ను సెట్ చేశారు. తాజాగా ఈ సినిమాను గురించి ధనుశ్ మాట్లాడుతూ .. "నేను ఇంతవరకూ చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడక్కడా రజనీ స్టైల్ ను ఫాలో అయ్యాను. ఆ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తాయి. మాఫియా డాన్ గా చేసేవారిపై ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది .. దాని నుంచి తప్పించుకోలేం" అని చెప్పాడు. రెండు భాషల్లో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.
Dhanush
Karthik Subbaraj
Rajani
Jagame Thanthiram

More Telugu News