Uttar Pradesh: యూపీలో అమానుష ఘటన.. కోడలిని రూ. 80 వేలకు అమ్మేసిన మామ!

Father in law sold his daughter in law for 80000 in UP
  • రైల్వే స్టేషన్‌లో ముఠా సభ్యుల అరెస్ట్
  • వారి చెర నుంచి మహిళను రక్షించిన పోలీసులు
  • అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మహిళలు
  • పరారీలో బాధిత మహిళ మామ, ప్రధాన నిందితుడు
మహిళలను కొనుగోలు చేసి, విక్రయించే ఓ ముఠా ఉత్తరప్రదేశ్ పోలీసులకు చిక్కింది. ఈ ముఠా ఇప్పటి వరకు 300 మంది మహిళలను ఇలా కొనుగోలు చేసి విక్రయించినట్టు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఓ వ్యక్తి తన కోడలిని ఈ ముఠాకు విక్రయించడం, అది తెలిసి ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బారాబంకీ జిల్లాలోని మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు. విషయం తెలిసిన బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని ముఠా చెర నుంచి విడిపించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన 8 మంది నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్‌తోపాటు మరో నిందితుడైన రాము గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలి మామ చంద్రరామ్ ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు.
Uttar Pradesh
Barabanki
Daughter-In-Law
Sold

More Telugu News